రాయికోడ్: పిప్పడ్ పల్లి అంగన్ వాడీ కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం పిప్పడ్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు అంగన్వాడి కేంద్రం లో నల్ల తాడు కట్టి అందులో నిమ్మకాయలు పసుపు కుంకుమ వేలాడదీసారని అంగన్వాడి ఆయా గుర్తించింది. దీంతో అంగన్వాడి ఆయా శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానికులకు సమాచారం అందించడంతో అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న స్థానికులు క్షుద్ర పూజలకు సంబంధించిన వాటిని తొలగించారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయని తెలిపారు.