రాయదుర్గం: క్రాకర్స్ అమ్మే వారు నిబంధనలు అతిక్రమిస్తే లైసన్సులు రద్దు చేస్తాం :పట్టణంలో డిఎస్పీ రవిబాబు హెచ్చరిక
క్రాకర్స్ అమ్మే షాపుల వారికి ఇప్పటికే పలుమార్లు నిబంధనలు వివరించామని వాటి మేరకు లేకుంటే చర్యలు తప్పవని డిఎస్పీ రవిబాబు హెచ్చరించారు. రాయదుర్గం పట్టణంలో సిఐ జయనాయక్ తో కలిసి ఆదివారం ఆయన మాట్లాడుతూ షాపుల మద్య 10 అడుగుల దూరం ఉండాలని, అగ్ని ప్రమాదాలు నివారించేందూకు అవసరమైన ఇసుక, నీరు, మంటలు ఆర్పే గ్యాస్ సిలిండర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 500 కిలోలకు మించి సరుకు ఉండరాదని అన్నారు. అక్రమ నిల్వలు ఉండటానికి వీలులేదని ఎవరైనా ఇతరచోట్ల విక్రయాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.