జనగాం: ఈనెల 17న జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి
ఈనెల 17న చలో జనగామ ను విజయవంతం చేయాలని జనగామ జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం చిల్పూర్ మండలంలోని కృష్ణాజిగూడెంలో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట ఉత్సవాల్లో భాగంగా కమ్యూనిస్టు పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కనకా రెడ్డి మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టు లే అని అన్నారు.భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకునేందుకే ఈ నెల 17 న ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి అన్నారు.