క్రీస్తు చూపిన శాంతి మార్గo సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్
Eluru, Eluru | Mar 31, 2024 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ప్రేమ, సేవాభావ గుణాలతో ఉండాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆకాంక్షించారు. ఏలూరు అమీనాపేట రిజర్వ్ పోలీస్ లైన్స్‌లోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో కుటుంబ సమేతంగా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి కలెక్టర్ సతీమణి డా.మానస హాజరయ్యారు.