ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : గూడూరు డీఎస్పీ
Gudur, Tirupati | Oct 22, 2025 వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, పాడుబడిన భవనాలు, హోర్డింగ్ బోర్డులు, చెట్లు, విద్యుత్ తీగల దగ్గర ఉండవద్దని సూచించారు. వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని చెప్పారు