మార్కాపురం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ప్రారంభించిన ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సరదాగా క్రికెట్ ఆడారు. కంభం సీఐ మల్లికార్జున, బెస్తవారిపేట తహసిల్దార్ జితేంద్ర బౌలింగ్ చేయక ఎమ్మెల్యే బ్యాటింగ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మార్కాపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.