తాడంకి హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరంకి నాగలక్ష్మి అనే మహిళ మృతి
Machilipatnam South, Krishna | Sep 24, 2025
పమిడిముక్కల మండలం తాడంకి హైవే వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల వీరంకి నాగలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై పామర్రు నుంచి విజయవాడ వెళ్తున్న భార్యాభర్తలను ఒక టీవీఎస్ ఎక్స్ప్రెల్ బైక్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై వెనుక కూర్చున్న నాగలక్ష్మి అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.