చింతపల్లి: చింతపల్లి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి పై విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్యురాలు శ్రీదేవి
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు శ్రీదేవి ఆపరేషన్ థియేటర్లో శ్రస్త చికిత్సలు ఎలా చేస్తారు వివరించారు. అలాగే ఓపి సేవలు జ్వరం గర్భిణీల ఆహారంపై మలేరియా చికెన్ గున్యతో పాటు ఇతర వ్యాధులపై వారికి అవగాహన కల్పించారు. భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుకోవాలని డాక్టర్ కు సూచించారు.