ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపారులకు బుధవారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రంక్ రోడ్డు పరిసర ప్రాంతాలలో వ్యాపారులను మందలించి రోడ్డుకు అడ్డంగా పెట్టి ఉన్న వస్తువులను తొలగించారు. ఉద్దేశపురాకంగా రోడ్డుపై వస్తువులు పెట్టి ఇబ్బందులు కలగచేస్తే జరిమన తప్పదని ట్రాఫిక్కుకు అంతరాయం కలగకుండా వ్యాపారులు వ్యవహరించాలని పోలీసులు వ్యాపారులను తీవ్రంగా హెచ్చరించారు