మేడ్చల్: పీర్జాదిగూడలో పార్కు స్థలం కబ్జాకు గురవుతుందని కాలనీవాసులు ఆందోళన
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సాయి ప్రియ కాలనీలో 2000 గజాల పార్థ స్థలం కబ్జాకు గురవుతుందని కాలనీవాసుల మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు. వారికి బిఆర్ఎస్, బిజెపి నేతలు మద్దతు తెలిపారు. పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ ఫ్రీ కాస్ట్ గోడలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాలనీలో మొత్తం ఆరు పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయని, దీని వెనక రాజకీయ నాయకుల అండ ఉందని అన్నారు.