అసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేసిన సీపీఎం జిల్లా నాయకులు
బీసీ రిజర్వేషన్లపై చలో రాజ్ భవన్ కు వెళ్తున్న సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ మండి పడ్డారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరుగుతున్న బీసీ బంద్ కు మా మద్దతు ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ప్రభుత్వం ఆపుతుందని పేర్కొన్నారు.