వికారాబాద్: గ్రామ పరిపాలన అధికారుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా జరిగింది: కలెక్టర్ ప్రతీక్ జైన్
తెలంగాణలో భూభారత్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి శ్రీకారం చుట్టిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లాలో క్లస్టర్ వారిగా 139 మందిని మండలాలకు కేటాయించి వారికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు