రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ శ్రేణులు
విదేశీ పర్యటనకు బయలుదేరుతున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు వెంకట మిథున్ రెడ్డి అక్టోబర్ 24 నుండి నవంబర్ 4 వరకు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా ఎంపీ హోదాలో అంతర్జాతీయ వేదికపై పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా న్యూయార్క్ కు బయలుదేరుతున్న ఎంపీ వెంకట మిథున్ రెడ్డి ని హైదరాబాదులోని వారి స్వగృహంలో ఏపీఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్ రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు