అసిఫాబాద్: భద్రత ప్రమాణాలు పాటించని టపాసులు యజమానులు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో లైసెన్సు పొందిన 14 టపాసు దుకాణాల యజమానుదారులు భద్రత ప్రమాణాలు పాటించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టికానంద్ సోమవారం ఆరోపించారు. దీపావళిని పురస్కరించుకొని టపాసుల విక్రయాల గురించి లైసెన్సు పొందిన దుకాణదారులు భద్రత ప్రమాణాలతో పాటు నియమ నిబంధనలను పాటించడం లేదని అన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలకు టపాసులు అమ్మవద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ అవేమీ పట్టనట్లుగా సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. టపాసుల దుకాణాల మధ్య దూరంతోపాటు ఇసుక నీళ్లు ఉండాలని లైసెన్సులో పేర్కొన్నప్పటికీ అవేమీ పాటించడం లేదని అన్నారు.