గన్నేరువరం: గునుకుల కొండాపూర్లో వర్షానికి కుంగిన వ్యవసాయ బావి పక్కన రోడ్డు, ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన #localissue
పొంచి ఉన్న ప్రమాదం,వర్షానికి కుంగిన వ్యవసాయ బావి పక్కన రోడ్డు,ఆదమరిస్తే అంతే సంగతి lకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నెహ్రూ చౌరస్తాకు సమీపంలో రోడ్డు ప్రక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్ద రోడ్డు బావిలోకి కుంగిపోయింది. అదృష్టవశాత్తు రాత్రిపూట ఏ భారీ వాహనం ఆ వైపుగా ప్రయాణం చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఏదైనా వాహనం బావి పక్కనున్న రోడ్డు వెంట వెళ్ళినట్లయితే మొత్తం రోడ్డు కూలీ బావిలోనే పడిపోవాల్సి వస్తుంది. ఉదయం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రవి గౌడ్, లింగంపల్లి హరీష్ లు రోడ్డు పరిస్థితిని గమనించి దగ్గర్లో