అచ్చంపేటలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి
అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై శ్యావల వెంగలరావు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పొలం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.