ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని, ఊళ్ల పాలెం వేములపాడు రోడ్డులో రెండున్నర దశాబ్దాలుగా కొందరు ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. దీని కారణంగా అక్కడ కాలుష్యం పెరిగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై సింగరాయకొండ మండల టీడీపీ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, పలువురు టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామన్నారు.