అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామంలో జరిగిన అగ్రి ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీరికి స్థానిక నాయకులు అధికారులు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు స్థానికులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో అప్పయ్యమ్మ వెంకట్రావు అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇళ్లు పూర్తిగా కాలిపోగా, వైసిపి ఎంపీటీసీ జగదీష్ ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కొంత నగదును ఇచ్చినట్లు చెప్పారు. అలాగే దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.