అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు లో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో కల్లూరు గ్రామానికి చెందిన హరి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.