చిలకలూరిపేటలో లారీని ఢీకొట్టిన బస్సు, ఇద్దరికి తీవ్ర గాయాలు
చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూనూరుకు చెందిన సుబ్బారెడ్డి బైక్పై వెళ్తుండగా, అతడిని తప్పించబోయిన టూరిస్ట్ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సునీల్, బైక్పై ఉన్న సుబ్బారెడ్డి గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.