మార్కాపురం: కుక్కలను పట్టుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపిన కమిషనర్ నారాయణరావు
ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో ఇప్పటివరకు 432 కుక్కలను పట్టుకోవడం జరిగిందని కమిషనర్ నారాయణరావు తెలిపారు. మిగిలిన 230 కుక్కలను పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నాగులవరం పరిసర ప్రాంతాల నుండి ఒక పిచ్చి కుక్క రావడం ప్రజలపై గాయాలు చేయడం వంటి వారిని గుర్తించి ప్రభుత్వ హస్పటల్ కు తరలించామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు