సూర్యాపేట: విద్యార్థులు డిజిటల్ ల్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలి:జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్
సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ సోమవారం అన్నారు. సోమవారం కోదాడలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.