రాయచోటి: దిత్వా తుఫాను ప్రభావంతో సోమవారం జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు: జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం
దిత్వా తుఫాను నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన అన్ని పాఠశాలలకు రేపు సోమవారం (01.12.2025) సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వర్షపాతం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు వర్షపు గుంటలు, నీటి కాలువలు, చెరువుల సమీప ప్రాంతాలు, అలాగే తడిచిన లేదా పాడుబడిన గోడల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.