అసిఫాబాద్: తెలంగాణ సాయుధ పోరాట సర్వ హక్కులు సిపిఐ పార్టీకే దక్కుతుంది: CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్
తెలంగాణ సాయుధ పోరాట సర్వ హక్కులు సిపిఐ పార్టీకే దక్కుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ పోరాటం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆనాడు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని, నైజాం ముఖాలు చేరి ప్రజలను చిత్రహింసలకు గురి చేసేవారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు స్వాతంత్రం రాలేదన్నారు.