జనగాం: జిల్లా కేంద్రంలో విజయ డైరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి,MLA పల్లా
జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం విజయ డైరి సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల ఉత్పత్తిదారులు,పాడి పాల్గొనగా విజయ డైరి ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “అసెంబ్లీలో మాట్లాడే మొదటి అవకాశం వచ్చినప్పుడు తాను జనగామ పాల రైతుల కోసం మాత్రమే మాట్లాడాను”అని గుర్తుచేశారు.రైతుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని,పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటా అన్నారు.