కుప్పం: రైతులకు పరిహారం అందజేసిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం నియోజకవర్గాన్ని ఓ మోడల్ పారిశ్రామిక నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కోసం భూములను సేకరించే ప్రక్రియను వేగవతం చేసింది. ఈ సందర్భంగా గుడిపల్లి మండలంలోని పొగరుపల్లిలో పరిశ్రమల కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు బుధవారం పరిహార చెల్లింపు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీదుగా 49 రైతులకు పరిహారం ప్రభుత్వం తరఫున అందజేశారు.