తాడిపత్రి: తాడిపత్రిలోని విజయలక్ష్మి థియేటర్ సమీపంలో పోలీసులు దాడులు, ఐదు మంది మట్కా బీటర్లు అరెస్ట్, నగదు స్వాధీనం
తాడిపత్రి లోని విజయలక్ష్మి థియేటర్ సమీపంలో గురువారం పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ మట్కా రాస్తున్న ఐదు మంది బీటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,01000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నాలుగు మొబైల్ ఫోన్ లను సీజ్ చేశారు. ఈ సంఘటనపై సీఐ ఆరోహణరావు కేసు నమోదు చేశారు.