మెడికల్ కళాశాల ల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బనగానపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పేదలకు వైద్య విద్య అందకూడదని కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. బుధవారం బనగానపల్లెలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అపద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు.