బనగానపల్లెలో ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం కొండపేటలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సోమవారం నుండి దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గణపతి పూజ గంగా పూజ గోపూజ పుణ్యా వచనం వంటి కార్యక్రమాలు నిర్వహించి కలశ స్థాపన నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు .అలాగే జొజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు మొదలుకొని తొమ్మిది రోజులు పాటు అమ్మవారు విశేషాలు అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు