నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దస్తగిరి బాబు, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళి ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పరిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామాల పరిశుభ్రతలో కార్మికుల శ్రమ కీలకమన్నారు. AO ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.