గిద్దలూరు: కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన బొలెరో వాహనం,గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై నడిచే వెళ్తున్న రమణ ను బొలెరో వాహనం ఢీకొట్టగా ఆ వ్యక్తికి ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిచానంతరం మెరుగైన వైద్యం కోసం వేరే ప్రాంతాలలోని ఆసుపత్రికలకు తరలిస్తామని వైద్యులు తెలిపారు. జరిగిన ప్రమాదం పై స్థానిక ఎస్సై నాగరాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.