జమ్మలమడుగు: గూడెంచెర్వు : గ్రామంలో పర్యటించిన నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ భూపేష్ రెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో సోమవారం జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా ఇంచార్జి భూపేష్ సుబ్బరామిరెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన గూడెంచెర్వు గ్రామానికి చెందిన బాలు యాదవ్ శ్రీ ఆంజనేయ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో గ్రామంలో అభివృద్ధి పనులు, సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. వారు తెల్పిన సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తానని తెలిపారు.