ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని ఆదివారం గుర్తించి స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా వారికి జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలను గుర్తించి మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతాలను వారితో శుభ్రం చేయించినట్లు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.