శేరిలింగంపల్లి సెంట్రల్ పార్క్ ఫేస్-1 కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ను ఎమ్మెల్యే గాంధీతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాంత్రిక జీవనంలో పెరిగే మానసిక ఒత్తిళ్లకు ఇలాంటి సాంస్కృతిక కేంద్రాలు చక్కని పరిష్కారం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.