శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.116 కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి లో సీఎం చంద్రబాబు శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ జిల్లాకు పెన్షన్ కోసం రూ.116 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు.జిల్లాలో 2.64 లక్షల మందికి పింఛన్లు అందస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నియోకవర్గం కదిరిలో 43 వేల మందికి రూ.19 కోట్లు, తలుపుల మండలంలో 6,777 మదికి రూ.3.5 కోట్లు, పెద్దన్నవారి పల్లిలో 756 మందికి రూ.33 లక్షలు ప్రతి నెలా అందజేస్తున్నామని పేర్కొన్నారు.