జగిత్యాల: జగిత్యాలలో యువకుడి హత్య,కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి ఒక యువకుడి హత్య కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలో సుతారిపేట కు చెందిన యువకుడు నహీముద్దీన్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు వెల్లడించారు . సోమవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.హత్య కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.