సర్వేపల్లి: వి.ఎస్.యూలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు
నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ) ప్రాంగణంలో "యాంటీ ర్యాగింగ్, సైబర్ క్రైమ్ నివారణ, మరియు డ్రగ్స్ దుర్వినియోగం నియంత్రణ" అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజ శ్రేయస్సుకు విద్యార్థుల కృషి అవసరం అని వీసీ తెలిపారు. సాంకేతికతను సమాజానికి మేలు చేసే విధంగా ఉపయోగించాలనీ బుధవారం సాయంత్రం పిలుపునిచ్చారు.