కాంగ్రెస్ నాయకులపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నగేష్ గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాదరి కిషోర్ తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడించి అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. మంత్రులపై అసభ్య పదజాలం వాడిన గాదరి కిషోర్ ను పళ్ళు ఊడగొట్టి తుంగతుర్తి నుంచి తరిమి కొట్టిన సిగ్గు రాలేదని మండిపడ్డారు.