చింతరాయి పల్లెకు చెందిన టీచర్‌కు పాన్ ఇండియా అవార్డు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతరాయిపల్లెకు నాగరాజు ఉత్తమ ఉపాధ్యా యుడిగా (గణిత శాస్రంలో) పాన్ ఇండియా ఐకానిక్ టీచర్స్ అవార్డ్స్-2025ను గుంటూరులో ఆదివారం అందుకున్నారు. ఈయన 25 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ వందలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అవార్డు సాధించడం హర్షించదగ్గ విషయమని తోటి ఉపాధ్యాయులు తెలిపారు.