వాకాడు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల నిరసన
Gudur, Tirupati | Oct 24, 2025 వాకాడు RTC డిపో ఎదుట శుక్రవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. మేనేజర్ ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అనారోగ్యాల కారణంగా సెలవులు తీసుకుంటే జీతాలు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.