ప్రొద్దుటూరు: వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: టూ టౌన్ సిఐ.సదాశివయ్య
Proddatur, YSR | Oct 24, 2025 వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టూ టౌన్ సిఐ సదాశివయ్య సూచించారు. కడప జిల్లా ఎస్పీ.నచికేత్ విశ్వనాథ్ , ప్రొద్దుటూరు డిఎస్పి భావన ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్రకేసరి రోడ్డు లోని పెద్ద గుంత వద్ద నాకాబందీ, వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు, వాహనానికి సంబంధించిన పత్రాలు, లైసెన్స్ కలిగి వుండాలని వివరించారు. లేనిపక్షంలో జరిమానా, చట్ట ప్రకారం చర్యలు వుంటాయని తెలిపారు.