స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పథకాలు సాధించిన గిరిజన విద్యార్థులు
స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో గిరిజన విద్యార్థులు ప్రతిపని చూపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అమలాపురంలో జరిగిన కరాటే టోర్నమెంట్ లో అక్క, తమ్ముడు జూనియర్ విభాగం లో తలపడగా స్పెరింగ్ లో బంగారు పథకం, కటాస్ లో రజాతం పధకాలను, అక్క తమ్ముళ్లు ఒకే విధంగా కైవసం చేసుకున్నారు. చింతపల్లి మండలం ఎర్నాపల్లి గ్రామానికి చెందిన పాడి. జాస్మిని కృష్ణ ప్రియ, పాడి. లోహిత్ కృష్ణ, చింతపల్లి ఏకలవ్య స్కూల్ లో చదువుతున్నారు. స్టేట్ ఇంటర్ కరాటే ఇన్విటేషన్ ఛాంపియన్ షిప్ లో వీరు పాల్గొన్నారు.