భారీ వర్షాలు నేపథ్యంలో వెంకటగిరిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము : కమిషనర్
Gudur, Tirupati | Oct 21, 2025 వెంకటగిరి పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మున్సిపాల్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కమిషనర్ వెంకటరామిరెడ్డి వెల్లడించారు. కాంపాళెం, సవారిగుంట, కైవల్య నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 3 రోజులు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సేవల కోసం 08625-295019 నంబర్‌కు ప్రజలు కాల్ చేయాలని కోరారు.