పులివెందుల: వేంపల్లిలో జరిగిన చోరీ కేసును చేదించిన పోలీసులు, బంగారు నగలు, వెండి స్వాధీనం
Pulivendla, YSR | Sep 20, 2025 కడప జిల్లా వేంపల్లి పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేదించారు. నిందితులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తాళాలు పగలగొట్టి 66 గ్రాముల 900 మిల్లీల బంగారు, 118 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 18వ తేదీన స్థానిక పిల్ల స్వామి గుట్ట జగనన్న కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు వెండి ఎత్తుకెళ్లారు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు శనివారం ఉదయం 11:30 ప్రాంతంలో వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద నిందితుడు షేక్ ఖాదర్ వలీ, వేంపల్లి టౌన్ కి చెందిన మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.