అనపర్తి: అనపర్తి కూటమి సీటుపై వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ అనపర్తిలో టిడిపి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ
అనపర్తి కూటమి సీటు బీజేపీకి ఇస్తారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ శనివారం అనపర్తి లో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ముందుగా అనపర్తి ఎస్.ఎన్.ఎన్.కల్యాణ మండపంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం అనపర్తి నుంచి రామవరం మాజీ రామకృష్ణారెడ్డి నివాసం వరకు నల్లమిల్లికి సంఘీభావం తెలుపుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.