ఆదోని: పెద్ద హరివానాన్ని మండలంగా ప్రకటించాలని బంద్ కు పిలుపునిచ్చిన గ్రామస్తులు
Adoni, Kurnool | Nov 1, 2025 పెద్దాహరివణాన్ని ప్రత్యేక మండలంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన కమిటీ శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. కమిటీ సభ్యులు ఉదయం గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించి దుకాణాలు, పాఠశాలలు మూసివేయించారు. అధిక జనాభా గల పెద్దాహరివణాన్ని మండలాల పునర్విభజనలో భాగంగా ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిరుగుప్ప-ఆదోని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.