కోడుమూరు: ప్యాలకుర్తిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినెల 1వ తేదీన ఇంటి వద్దకే పింఛన్ సొమ్ము అందిస్తూ లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని తెలిపారు. దేశంలో అధిక మొత్తంలో పింఛన్ సొమ్ము అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. గ్రామంలో టిడిపి నాయకుడు విజయ్ మాతృమూర్తి మృతి చెందడంతో ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే కారు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లను పరామర్శించారు.