మేకావారిపాలెంలోని సొసైటీ కార్యాలయంలో 'స్వస్థ నారీ-సశక్త్ పరివార్' కార్యక్రమం
Machilipatnam South, Krishna | Sep 23, 2025
చల్లపల్లి మండలం పాగోలు శివారులోని మేకావారిపాలెంలోని సొసైటీ కార్యాలయంలో 'స్వస్థ నారీ-సశక్త్ పరివార్' కార్యక్రమం నిర్వహించారు. మండల వైద్యాధికారి శివరామకృష్ణ మహిళలకు ఆరోగ్య సూచనలు ఇచ్చి, వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన మందులను కూడా ఉచితంగా అందించారు. కార్యక్రమంలో సొసైటీ CEO శ్రీనివాసరావు పాల్గొన్నారు.