ముధోల్: బాసర దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Mudhole, Nirmal | Sep 18, 2025 నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం అమ్మవారిని ప్రార్థించిన కలెక్టర్కు దేవస్థానం అర్చకులు ఆశీర్వచనం అందించి, సాంప్రదాయరీతిలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆలయ పరిసరాలను అధికారులు, పూజారులతో కలిసి పరిశీలించారు. రానున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని సూచించారు. క్యూ లైన్లు, వి ఐ పి క్యూ లైన్స్, అక్షరాభ్యాసం మండపాలు, దర్శనం, లడ్డు కౌంటర్లు, సీసీటీవీ కెమెరాలు,