మంత్రాలయం: ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న హుండీ లెక్కింపు
కౌతాళం: మండల పరిధిలోని ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో ఆలయ అధికారిణి కె.వాణి ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ సిబ్బంది పకడ్బంది ఏర్పాట్ల మధ్య స్వామివారి హుండీని లెక్కిస్తున్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో భ్రమరాంబ సేవా సమితి సభ్యులు పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.